సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మరణంలోనూ వెలుగులు నింపిన యువకుడు..

27 నిమిషాల క్రితం

sar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 11:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ముగ్గురికి అవయవదానం

ప్రజాశక్తి - ఆరిలోవ (విశాఖపట్నం) : అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలానికి చెందిన యువకుడు మజ్జి రమేష్ తాను మరణించినా మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ నెల 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రమేష్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే విశాఖ నగరంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్య బృందం అతడిని కాపాడేందుకు అహర్నిశలూ శ్రమించింది. అత్యాధునిక వైద్యం అందించినా, మెదడుకు జరిగిన తీవ్ర నష్టం కారణంగా పరిస్థితి విషమించింది. చివరకు 18న వైద్యులు రమేష్‌కు బ్రెయిన్ డెడ్‌ అయినట్లు ప్రకటించారు. ఆ దుఃఖంలోనూ వైద్యుల సూచన మేరకు కుటుంబసభ్యులు మంచి నిర్ణయం తీసుకున్నారు. అవయవదానానికి అంగీకరించారు. వెంటనే ఆసుపత్రి వైద్య బృందం ఈ విషయాన్ని రాష్ట్ర జీవన్‌దాన్ కో-ఆర్డినేటర్ డాక్టర్ వి.మన్మధరావు దృష్టికి తీసుకువెళ్లింది. ఆయన వెంటనే స్పందించి అవయవాల స్వీకరణకు అవసరమైన అనుమతులు మంజూరు చేశారు. అనంతరం రమేష్‌ ‌నుంచి రెండు కిడ్నీలను, లివర్‌ను వైద్య బృందం స్వీకరించింది. వాటిని జీవన్‌దాన్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్‌పై ఆధారపడి జీవిస్తున్న ఇద్దరు రోగులకు, లివర్ సమస్యతో బాధపడుతున్న మరొక బాధితుడికి కేటాయించారు. అవయవదాన ప్రక్రియ పూర్తయిన తర్వాత, రమేష్ మృతదేహానికి డాక్టర్ వి.మన్మధరావు ఆధ్వర్యంలో వైద్య బృందం, ఆసుపత్రి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్