- అగర్వాల్, నిషాద్ రికార్డు పసిడి
- తొలిరోజే భారత్‌కు 4
- స్వర్ణాలతో సహా 11 పతకాలు 5వ ఆసియా పారా క్రీడలు
నగోయా(జపాన్): 5వ ఆసియా పారా క్రీడల్లో తొలిరోజే భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. తొలిరోజే భారత్‌కు 4స్వర్ణాలతో సహా 11 పతకాలు దక్కాయి. ఇందులో 4 స్వర్ణ, 5 రజత మరో 2 కాంస్య పతకాలు ఉన్నాయి. షూటింగ్‌లో మోనా అగర్వాల్, లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్ తొలుత స్వర్ణ పతకాల అందించగా.. ఆర్చరీలో శీతల్ దేవి ప్రపంచ రికార్డును సమం చేసి మరో బంగారు పతకాన్ని అందించింది. ఇక లాంగ్‌జంప్‌లో నిషాద్ కుమార్ పసిడితో అదరగొట్టాడు. ఆర్చరీ మహిళల కాంపౌండ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో శీతల్ దేవీ 720 పాయింట్లకు 704 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డును సమం చేయడంతో పాటు సరికొత్త ఆసియా రికార్డును నెలకొల్పింది. గతంలో ఆసియా గేమ్స్‌లో తాను నెలకొల్పిన 698 పాయింట్ల రికార్డును ఆరు పాయింట్ల తేడాతో బద్దలు కొట్టింది. క్వాలిఫికేషన్‌లో 750 పాయింట్లకుగాను శీతల్ 702 పాయింట్లు తన పేర ఉన్న 690పాయింట్లు రికార్డును బ్రేక్ చేసి ఫైనల్‌కు చేరింది. అలాగే థోమర్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కొత్త ప్రపంచ రికార్డు(1,402పాయింట్లు)ను నెలకొల్పారు. ఒకాజాకి చువో సోగో పార్క్ మల్టీపర్పస్ స్క్వేర్‌లో జరిగిన ర్యాంకింగ్ రౌండ్‌లో వీరు ఈ ఫీట్ సాధించారు. ఇంతకుముందు శీతల్-రాకేష్ కుమార్ పేరిట ఉన్న 1,400 పాయింట్ల ప్రపంచ రికార్డును బ్రేక్ చేశారు.
షూటింగ్, లాంగ్ జంప్ విభాగాల్లో మోనా అగర్వాల్, నిషాద్ కుమార్ రికార్డు స్కోర్‌తో భారత్‌కు స్వర్ణ పతకాలను అందించారు. మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 క్వాలిఫికేషన్ రౌండ్‌లో మోనా అగర్వాల్, అవని లేఖర తొలి రెండు స్థానాల్లో నిలిచి పతకాలను ఖాయం చేశారు. అగర్వాల్ 629.1 పాయింట్లు సాధించి కొత్త ఆసియా పారా గేమ్స్ క్వాలిఫికేషన్ రికార్డును నెలకొల్పగా.. అవని లేఖర 626.4 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇక లాంగ్‌జంప్‌లో నిషాద్ కుమార్ బంగారు పతకంతో మెరిసాడు. సోమవారం జరిగిన పురుషుల లాంగ్‌జంప్ టి-47లో రెండుసార్లు పారా ఒలింపిక్స్‌లో రజత పతకాలు సాధించిన నిషాద్.. తొలి ప్రయత్నంలో 6.90మీ. రెండో ప్రయత్నంలో 7.09మీ., మూడో ప్రయత్నంలో 7.11మీ. జంప్ చేసాడు. నాల్గో ప్రయత్నం ఫౌల్ కాగా.. ఐదో, చివరి జంప్‌ను 7.07మీ.లతో ముగించాడు. దీంతో మూడు ప్రయత్నంలో చేసి అత్యుత్తమ జంప్‌తో అతడు ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఆసియా పారా క్రీడల్లో రికార్డు నెలకొల్పాడు. ఇంతకముందు ఈ రికార్డు నిషాద్(6.95మీ.) పేర ఉండేది. ఇక ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఖనసోవ్ (6.99మీ.), శ్రీలంకకు చెందిన మహ్మదు సఫ్రాన్ (6.55మీ.) రజత, కాంస్య పతకాలు దక్కాయి.
పురుషుల జూడో 70 కేజీల జే1 విభాగంలో కపిల్ పర్మార్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కాంస్య పోరులో ఇండోనేషియాకు చెందిన అహ్నాఫ్ రఫ్లిపై కపిల్ విజయం సాధించాడు. అంతకుముందు సెమీస్‌లో ఇండోనేషియాకు చెందిన జునాయిది చేతిలో 0-1 తేడాతో కపిల్ ఓటమిని చవిచూశాడు. మహిళల జూడో 52 కేజీల జే2 విభాగంలో భారత్‌కు పతకం ఖాయమైంది. కోకిల ఫైనల్‌కు చేరుకుని సత్తా చాటింది. సెమీస్‌లో కోకిల 1-0 ఆధిక్యంతో చైనాకు చెందిన యు లియుపై విజయం సాధించింది. ఫైనల్‌లో కజకిస్థాన్‌కు చెందిన ఐబికె ఉలాన్బెక్‌తో స్వర్ణం కోసం పోరాడనుంది. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు పతకం ఖాయమైంది. నితీశ్ కుమార్ తులసిమతి మురుగేశన్ జోడీ ఎస్‌ఎల్ 3 - ఎస్‌యూ 5 విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ బిలో అజేయంగా నిలిచిన భారత్ జోడీ సెమీస్‌లో అడుగు పెట్టింది. తొలి మ్యాచ్‌లో భారత్‌కు వాకోవర్ వచ్చింది. రెండో మ్యాచ్‌లో చైనాకు చెందిన చెన్ పెంగ్‌ఫెయి - హువాంగ్‌పై 21-4, 21-18 తేడాతో భారత జోడీ విజయం సాధించింది. ఇక బ్యాడ్మింటన్‌లో నితేష్, తులసిమతి మురుగేశన్ ఎస్‌ఎల్-3, ఎస్‌యు-5 ఈవెంట్‌లో సెమీఫైనల్‌కు చేరి మిక్స్‌డ్ డబుల్స్ పతకాన్ని ఖాయం చేశారు. చేసుకున్నారు.
జూడో: దృష్టి లోపం ఉన్న జూడో క్రీడాకారులు భారత్‌కు మరో రెండు పతకాలను అందించారు. మహిళల జె2 -52 కేజీల విభాగంలో కోకిల రెండవ స్థానంలో నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్‌లో కోకిల కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన ఐబికే ఉలాన్‌బెక్ కైజీ చేతిలో ఓటమిపాలై రజత పతకానికి పరిమితమైంది. ఇక పురుషుల విభాగం సెమీస్‌లో ఓడిన కపిల్ పర్మార్ కాంస్య పతకానికి పరిమితమయ్యాడు. గత క్రీడల్లో రజత పతకం సాధించిన కపిల్, పురుషుల జె1-70కిలోల విభాగంలో ఈసారి కాంస్య పతకానికి పరిమితయ్యాడు. సెమీఫైనల్‌లో ఇండోనేషియాకు చెందిన జునైదీ చేతిలో 0-1తో ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత జరిగిన ప్లేఆఫ్ పోరులో మరో ఇండోనేషియా క్రీడాకారుడు అహ్నాఫ్ రాఫ్లీ షిద్ఖీపై అదే తేడాతో విజయం సాధించి కాంస్య పతకం సాధించాడు.
స్విమ్మింగ్‌లో రవి కార్తీక్ కు రజతం: పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్-13 విభాగంలో రవి కార్తీక్ బుడిగిన రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తక్కువ దృష్టి లోపం ఉన్న ఈతగాళ్ల మధ్య జరిగిన ఈ పోటీలో రవి 56.68 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు.
పారా ఆసియా క్రీడల్లో షూటింగ్‌లో తొలి స్వర్ణ పతకం అందించిన మోనా అగర్వాల్
షూటింగ్ 10మీ. ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో భారత్‌కు చెందిన ఇద్దరు షూటర్లు ఫైనల్‌లో తలపడ్డారు. మోనా అగర్వాల్ విజేతగా నిలిచి స్వర్ణం కైవసం చేసుకోగా.. కేవలం 0.4 పాయింట్ల తేడాతో అవని లేఖర రజతంతో సరిపెట్టుకుంది. మోనా మొత్తం 250పాయింట్లు సాధించగా.. అవని 249.6 పాయింట్లు రాబట్టింది. ఇక దక్షిణ కొరియాకు చెందిన లీ యున్రి (227.9) మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది.
టిటిలో భవినా జోరు
పారాలింపిక్ రజత పతక విజేత భవినాబెన్ పటేల్‌తో పాటు ప్రాచీ పాండే, సోనల్‌బెన్ పటేల్ తమ విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. భావినా పటేల్, క్లాస్ 4-5 క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన జాంగ్ మియావోతో తలపడ్డారు. మొదటి గేమ్‌ను కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత పుంజుకున్న భావినా 8-11, 11-6, 11-1, 11-6 తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో చైనాకు చెందిన యాంగ్ జియాన్యువాన్ మరియు యాంగ్ క్విక్సియాపై వాకోవర్ పొందిన తర్వాత, వారు ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో కేవలం 23 నిమిషాల్లోనే చైనాకు చెందిన చెన్ పెంగ్ఫే మరియు హువాంగ్ జిక్సువాన్‌లను 21-4, 21-18 తేడాతో ఓడించారు. మహిళల క్లాస్ 6 విభాగంలో ప్రాచీ పాండే థాయిలాండ్‌కు చెందిన కనోక్‌పోర్న్ ఫతుమ్‌చాయ్‌పై 11-5, 11-4, 11-13, 12-10 తేడాతో విజయం సాధించింది. క్లాస్-3 విభాగంలో సోనల్‌బెన్ పటేల్ క్వార్టర్ ఫైనల్‌లో థాయిలాండ్‌కు చెందిన దరారత్ అసయుత్‌పై 3-1 (11-7, 8-11, 11-5, 11-5) తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.







కామెంట్‌లు (0)