అమరావతి : మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి కడప ఎంపి అవినాష్ రెడ్డి బుధవారం ఇడి ముందు విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ కోణంలో ఎంపి ని ఇడి అధికారులు విచారించనున్నారు. ఈ సందర్భంగా 2019 నుంచి బ్యాంకు లావాదేవీలపై స్టేట్మెంట్లను ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఎంపి అందజేశారు. రూ.40 కోట్ల సుపారీతో పాటు సంఘటనా స్థలంలో ఆధారాలు చెరిపి వేయడంపై ఇడి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయవాదితో కలిసి ఎంపి అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య కేసులో సిబిఐ ఛార్జ్షీట్ల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఇప్పటికే ఇడి విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి హాజరయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో అవినాష్ రెడ్డి నివాసంలో సోదాలు జరిపిన ఇడి.. రూ.24 లక్షల నగదు, బ్యాంక్ లాకర్ కీ ని స్వాధీనం చేసుకుంది. వివేకా హత్య కోసం రూ.40 కోట్లు ఆఫర్ చేశారని గతంలోనే ఎంపి పై సిబిఐ అభియోగం మోపింది. సుపారీ, మనీ ట్రయిల్పై సునీల్ యాదవ్, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అవినాష్ రెడ్డిని ఇడి విచారించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇడి గుర్తించిన బ్యాంకు లాకర్లు, నగదుపైనా అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.
ఇడి విచారణకు ఎంపి అవినాష్ రెడ్డి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 12:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)