బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ యూఏఈదే..

1 గంట క్రితం

visa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 01:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- భారత్‌కు 72వ స్థానం

దుబాయ్‌: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పాస్‌పోర్ట్‌ నిలిచింది. గ్లోబల్‌ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌లో యూఏఈ తొలి స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో భారత్‌ 72వ స్థానంలో నిలిచింది. యూఏఈ పాస్‌పోర్ట్‌ ఉన్నవారు ముందస్తు వీసా లేకుండా లేదా సులభమైన ప్రవేశ అనుమతులతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ప్రయాణించవచ్చు. మొత్తం 182 దేశాలకు సులభంగా వెళ్లే అవకాశం ఉండగా, వీటిలో 138 దేశాలకు పూర్తిగా వీసా లేకుండా ప్రవేశించవచ్చు. మరో 44 దేశాల్లో వీసా ఆన్‌ అరైవల్‌, ఈ-వీసా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో సింగపూర్‌, మలేషియా పాస్‌పోర్ట్‌లు రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌ కలిగిన వారు 175 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. 174 దేశాలకు ప్రవేశ సౌకర్యంతో స్పెయిన్‌ మూడో స్థానాన్ని దక్కించుకుంది. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సలహా సంస్థ ఆర్టన్‌ క్యాపిటల్‌ ఈ గ్లోబల్‌ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ను విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితికి చెందిన 193 సభ్య దేశాలతో పాటు మరో ఆరు ప్రాంతాలను కలిపి మొత్తం 199 దేశాలు, ప్రాంతాల్లో ప్రయాణ సౌకర్యాలను ఈ సంస్థ విశ్లేషించింది. వీసా లేకుండా ప్రవేశం, అక్కడికి చేరుకున్న తర్వాత వీసా పొందే అవకాశం, ఎలక్ట్రానిక్‌ ప్రయాణ అనుమతి వంటి అంశాల ఆధారంగా పాస్‌పోర్ట్‌లకు మొబిలిటీ స్కోర్‌ కేటాయించి ఈ ర్యాంకులను నిర్ణయించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్