బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కుంటలు, బావుల వద్దకు వెళ్లవద్దు

1 గంట క్రితం

atp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 01:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- అప్రమత్తంగా ఉండండి.!

- పుట్లూరు చెరువు వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తహసిల్దార్ బాలమ్మ

ప్రజాశక్తి-పుట్లూరు: మండలం లోని కుంటలు, బావులు ఆటస్థలాలు కావు.. ప్రమాదాలు పొంచి ఉండే ప్రదేశాలు. దసరా సెలవులు కావున పిల్లలు ఇంటి వద్దనే ఉన్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండవలెను. తాసిల్దార్ బాలమ్మ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని గ్రామస్తులతో సమావేశం తమ పిల్లలను పిల్లలు ఆడుకోవడానికి, ఈత కొట్టడానికి కుంటలు, బావుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. నీటి లోతు తెలియక ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. అందువల్ల పిల్లలను ఎల్లప్పుడూ గమనిస్తూ, నీటి వనరుల వద్దకు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ చెరువుల్లో కుంటల్లో నీరు పిల్లలు ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు ఉన్నచోట జాగ్రత్తలు తీసుకోవాలని తాసిల్దార్ బాలమ్మ ప్రజలకు సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అత్యవసర సహాయం కోసం 112కు, 108 సంప్రదించాలి. తల్లిదండ్రులారా.. అప్రమత్తంగా ఉండండి! పిల్లల భద్రతే మనందరి బాధ్యత. చిన్న నిర్లక్ష్యం.. తీరని విషాదం కావద్దు! తాసిల్దార్ బాలమ్మ సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్