బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

29 వ రోజు - విఆర్ఏ ల సమ్మె

1 గంట క్రితం

Day 29 - VRAs' Strike
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 01:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కపిలేశ్వరపురం (తూర్పు గోదావరి) : కపిలేశ్వరపురం తహసిల్దార్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన విఆర్ఏల సమ్మె బుధవారం 29 వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా విఆర్ఏల సంఘ అధ్యక్ష కార్యదర్శులు పలివెల నాగేశ్వరరావు, కొల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ... తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. విఆర్ఏ లకు కనీస వేతనం అమలు చేయడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, నామిని విఆర్ఏ లను వెంటనే గుర్తించి వారికి న్యాయం చేయాలని, తదితర సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎ శివప్రసాద్, ఎం జానకి బాబు, పి సూర్య ప్రకాష్ , మండల విఆర్ఏలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్