బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీలో జర్నలిస్టులపై దాడులకు నిరసనగా విశాఖలో ధర్నా

2 గంటల క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 12:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పత్రికా స్వేచ్ఛకు విఘాతం

- జర్నలిస్టుల ధర్నా

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్: ఢిల్లీలో జర్నలిస్టులపై పోలీసుల దాడులకు నిరసనగా ఎపిడబ్ల్యూజెఎఫ్, ఎపిబిజె, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం విశాఖపట్నం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఎన్ఎజె రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి.నారాయణ మాట్లాడుతూ,దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసుల దురుసు ప్రవర్తన, దాడులు, నిర్బంధ ఘటనలను ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. మాట్లాడుతూ ఈ నెల 10, 11 తేదీల్లో ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పలువురు జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు, కొందరిపై భౌతిక దాడులకు పాల్పడడం దారుణమని తెలిపారు. వార్తా సేకరణ కోసం కవర్ చేస్తున్న జర్నలిస్టులు తమ ప్రెస్ ఐడీ కార్డులను చూపించినప్పటికీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టులను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించడం, కెమెరాలు, మైకులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం, వార్తా సేకరణకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. 10,11 తేదీల్లో ఢిల్లీలోనే కనీసం 35 మంది జర్నలిస్టులను నిర్బంధించినట్లు జర్నలిస్టుల రక్షణ కోసం పనిచేసే కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సిపిజె) తన నివేదికలో పేర్కొందని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను నిర్బంధించడం,వారి వార్తా సేకరణ పరికరాలను స్వాధీనం చేసుకోవడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని పేర్కొంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిడబ్ల్యూజెఎఫ్ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసరావు,నాయకులు ఎన్. మధుసూదనరావు, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్, కార్యదర్శి శ్రీనివాస్, మళ్ల దేవ త్రినాథ్, భాగ్యరాజ్, సతీష్,లత శ్రీ, కృష్ణమూర్తి నాయుడు, శర్మ,పలువురు జర్నలిస్టు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్