శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెట్టుబడిదారులకు కాదు... రైతులకు, కార్మికులకు రక్షణచట్టం కావాలి

24 నిమిషాల క్రితం

పెట్టుబడిదారులకు కాదు...
రైతులకు, కార్మికులకు రక్షణచట్టం కావాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కరువు, వరదలతో నష్టపొయిన రైతులను ఆదుకోండి

  • విలేకరుల సమావేశంలో
వి. శ్రీనివాసరావు డిమాండ్‌

  • 26న ఓటు పరిరక్షణ దినంను జయప్రదం చేయాలని పిలుపు

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : రక్షణ చట్టం కావాల్సింది పెట్టుబడిదారులకు కాదని, రైతులకు, కార్మికులకు కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. అనంతపురంలోని గణేనాయక్‌ ‌భవనంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంల ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులకు రక్షణ కల్పించే చట్టం తీసుకొస్తామంటూ విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమ్మిట్‌‌లో సిఎం ప్రకటించడాన్ని ప్రస్తావించారు. రైతులు, కార్మికులు, మహిళలకు రాష్ర్టంలో రక్షణ కల్పించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించి, వీరి రక్షణకు చట్టం తీసుకురావాలని చెప్పారు. రాష్ర్టంలో పెట్టుబడిదారులకు సహజ వనరులను దోచిపెడుతున్నారని, కారుచౌకగా భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. వారివల్ల రైతులకు రక్షణ లేకుండా పోతోందన్నారు. ఒకవైపు తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని, మరోవైపు తుపాను ప్రభావంతో రైతులు భారీగా నష్టపోయారని తెలిపారు. వారిని ఆదుకునే చర్యలేవీ ప్రభుత్వం ఇంతవరకు తీసుకోలేదన్నారు. వరద ప్రాంతాల్లో కనీసం ఎన్యూమరేషన్‌ ‌ప్రక్రియ కూడా జరగలేదన్నారు. డబుల్‌ ఇంజన్‌ ‌సర్కారు అని చెప్పుకుంటున్న టిడిపి కూటమి ప్రభుత్వం, నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి లక్ష కోట్ల రూపాయలు పరిహారం తీసుకురావాలని డిమాండ్‌ ‌చేశారు. ఇది డబుల్‌ ఇంజన్‌ ‌సర్కారు కాదని, బుల్డోజర్‌ ‌సర్కారు అని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయన్నారు. ఇటీవల రాష్ర్టంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే ఇందుకు నిదర్శమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఓటు హక్కే లేకుండా చేస్తోందన్నారు. ఎస్‌ఐఆర్‌‌తో దేశంలో 13 కోట్ల మందికి ఓట్లు లేకుండా చేసిందని గుర్తు చేశారు. రాష్ర్టంలోని టిడిపి కూటమి ప్రభుత్వం ఓటు హక్కు ఉన్నా వినియోగించుకునే అవకాశం లేకుండా చేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బలంతో దౌర్జన్యంగా పోలింగ్‌ ‌కూడా సక్రమంగా జరగనీయకుండా ఏకపక్షంగా స్థానాలను కైవసం చేసుకుందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే, ఆయన కుమారుడు లోకేష్‌ బలవంతంగా ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఈనెల 26న ఓటు పరిరక్షణ దినం పేరుతో కార్యక్రమాలు చేపట్టేందుకు సిపిఎం పిలుపునిస్తోందని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

కార్మికుల ‘చలో ఢి‌ల్లీ’కి సిపిఎం మద్దతు

కార్మికుల సమస్యలపై డిసెంబరు 1, 2 తేదీల్లో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. నవంబర్‌ 26న రైతు సంఘాలు చేపట్టిన నిరసనకు మద్దతునిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగేంద్రకుమార్‌, వి.రామిరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. ​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్