శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం

34 నిమిషాల క్రితం

అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం
- ట్రక్కు బస్సు ఢీకొని 23 మంది మృతి, ఏడుగురికి గాయాలు


​ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 11:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ట్రక్కు బస్సు ఢీకొని 23 మంది మృతి, ఏడుగురికి గాయాలు

గువాహటి: అస్సాంలోని కజిరంగా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఘటనా స్థలంలోనే 15 మంది మృతి చెందగా, మిగిలినవారు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరణించిన వారిలో బొకాఖాత్‌లోని సిఎన్‌బి కళాశాల విద్యార్థులతో పాటు కజిరంగా హైస్కూల్ విద్యార్థులున్నారని అధికారులు భావిస్తున్నారు.

శుక్రవారం నాడు బొకాఖాట్ నుంచి నాగావ్ వైపు వెళుతున్న మినీ బస్సు (ట్రావెలర్) కజిరంగా కోహోరా పరిధిలోని హథీకూలి టీ ఎస్టేట్ సమీపంలో గల రంగాజన్ వద్ద జాతీయ రహదారి 715పై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వేగంగా వస్తున్న కంటైనర్ ట్రక్కును మినీ బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మినీ బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయి ప్రయాణికులు లోపలే ఇరుక్కుపోయారు. ‘‘మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ 23 మంది మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతదేహాలను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని’’ అని గోలాఘాట్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 27 నుంచి 35 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది కళాశాల విద్యార్థినులతో పాటు కజిరంగా హైస్కూల్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన పలువురిని వెంటనే స్థానిక కోహోరా మోడల్ ఆసుపత్రికి తరలించారు. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న బాధితులను మెరుగైన వైద్యం కోసం జోర్హాట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

గుర్తించిన మృతుల్లో జ్యోతి మాఝీ, దర్పణా మాఝీ, అనురాగ్ గోలా (12 ఏళ్ల బాలుడు), అబ్దుల్ ముజిద్ (మినీబస్సు డ్రైవర్), సుభాష్, రషీద్ అలీ, హఫీజా ఖాతున్, ఫర్హానా యాస్మిన్‌గా ఎనిమిది మందిని ఉన్నారని గోలాఘాట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు యత్నించారు. బస్సు నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నామని, మరణాల సంఖ్య పెరగవచ్చని గోలాఘాట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వప్ననీల్ డేకా చెప్పారు.

అతివేగమే కారణమా?

నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నిర్దేశించిన వేగ పరిమితి నిబంధనలను ఉల్లంఘించి మినీ బస్సు అతివేగంతో వెళ్లడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో అధికారులు గుర్తించారు. మితిమీరిన వేగం కారణంగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్