- ప్రధాన ఎన్నికల అదనపు అధికారి ఢిల్లీ రావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్) మార్గదర్శకాల ప్రకారం, గత సవరణలోని ఓటర్ల జాబితా ప్రకారం ప్రస్తుత జాబితాలో ఓట్లు కోల్పోయిన వారికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అదనపు అధికారి ఢిల్లీ రావు పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసిన ఓటర్ల జాబితాలను అన్ని పోలింగ్ కేంద్రాల్లో, జిల్లా అధికారిక వెబ్ సైట్‌లో, అన్ని ఇఆర్‌ఒ, ఎఇఆర్‌ఒ కార్యాలయాల్లో, సంబంధిత పంచాయతీ లేక మున్సిపల్ కార్యాలయాల్లోను ప్రదర్శించాలని శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయినట్లు 3 రోజుల్లో దృవీకరణ ప్రతాన్ని జిల్లా ఎన్నికల అధికారులకు సమర్పించాలని సూచించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు ఈ నెల 14 నుంచి 17 వరకు అదనపు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. డిఇఒలు ఇఆర్‌ఒ, ఎఇఆర్‌ఒలకు, ఇఆర్‌ఒలు బిఎల్‌ఒ సూపర్‌వైజర్లకు, బిఎల్‌లకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ నెల 18వ తేదీన నిర్ధేశించిన నమూనాల్లో ఇందుకు సంబంధించిన ధృవీకరణ ప్రతాలు సమర్పించాలని ఆదేశించారు.








కామెంట్‌లు (0)