- నిమజ్జనాల వ్యర్ధాలను స్వచ్ఛందంగా పరిశుభ్రం
ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : వాడరేవు బీచ్ పరిశుభ్రతకు మత్స్యకారులు, గ్రామస్తులు ముందడుగు వేశారు. సోమవారం మన వాడరేవు.. మన బాధ్యత నినాదంతో యువత బీచ్ పరిసరాల్లో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. చీపుర్లతో పరిసరాలను శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని తొలగించారు. వినాయక నిమజ్జనాల అనంతరం పేరుకుపోయిన వ్యర్థాలను సేకరించి ట్రాక్టర్ ద్వారా తరలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బందితో పాటు గ్రామస్తులు, యువకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బీచ్‌కు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు మత్స్యకారులు తెలిపారు. కలెక్టర్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే కొండయ్య సూచనల మేరకు వాడరేవు పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీక్కి నారాయణ, పారా యేసుబాబుతో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)