సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సౌతాఫ్రికా టెస్టు జట్టులో యువ బ్యాటర్‌కు చోటు

1 గంట క్రితం

Young batter earns a spot in South Africa's Test squad.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 02:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

డర్బన్‌ : ఆస్ట్రేలియాతో అక్టోబర్‌ 9 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం సౌతాఫ్రికా 18 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ప్రకటించింది. డర్బన్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న స్టార్‌ పేసర్‌ కగిసో రబడకు జట్టులో చోటు దక్కింది. అయితే మ్యాచ్‌కు ముందు అతను పూర్తి ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది.


గెరాల్డ్‌ కోయెట్జీ, అన్రిచ్‌ నోర్ట్జే, డేన్‌ ప్యాటర్సన్‌లను సెలక్టర్లు తిరిగి టెస్టు జట్టులోకి ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు తరఫున రాణించిన అన్‌క్యాప్డ్‌ బ్యాటర్‌ మార్క్వెస్‌ అకెర్‌మాన్‌కు తొలిసారి జాతీయ జట్టులో అవకాశం లభించింది.


టాప్‌ ఆర్డర్‌లో స్థానం కోసం అకెర్‌మాన్‌, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్‌ స్టబ్స్‌ మధ్య పోటీ నెలకొననుంది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2025–27 సైకిల్‌లో భాగంగా ఆస్ట్రేలియా–సౌతాఫ్రికా మధ్య మూడు టెస్టులు జరగనున్నాయి. మరోవైపు, ఇరు జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను సౌతాఫ్రికా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది.


సౌతాఫ్రికా జట్టు : టెంబా బవుమా, మార్క్వెస్‌ అకెర్‌మాన్‌, డేవిడ్‌ బెడింగ్‌హామ్‌, కార్బిన్‌ బాష్‌, గెరాల్డ్‌ కోయెట్జీ, టోనీ డి జోర్జీ, సైమన్‌ హర్మర్‌, మార్కో జాన్సెన్‌, కేశవ్‌ మహారాజ్‌, ఐడెన్‌ మర్క్రామ్‌, వియాన్‌ ముల్డర్‌, సెనురాన్‌ ముత్తుసామి, అన్రిచ్‌ నోర్ట్జే, డేన్‌ ప్యాటర్సన్‌, కగిసో రబడ, ర్యాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కైల్‌ వెర్రెయిన్‌.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్