నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలీస్ శాఖలోని 1,534 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్ రాజీవ్ కుమార్ మీనా గురువారం విడుదల చేశారు. శుక్రవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. 378 ఎస్‌ఐ పోస్టుల్లో సివిల్ 253, ఎఆర్‌లో 116 ఆర్‌ఎస్‌ఐ, ఎస్‌పిఎఫ్‌లోని మరో 9 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. 1,156 కానిస్టేబుల్ పోస్టుల్లో సివిల్ 542, ఎఆర్‌లో 285, ఫైర్ సర్వీస్‌లో 158, జైళ్ల విభాగంలో 150 (పురుషులు), 21 మహిళా పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకూ శుక్రవారం నుంచి సాయంత్రం 5 గంటల నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం 5వ తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 28న ఎస్‌ఐ పోస్టులకు, జనవరి 31న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్ష జరగనుంది. ఎస్‌ఐ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. కానిస్టేబుల్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. హెల్ప్ లైన్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ను సందర్శించాలని రాజీవ్ కుమార్ తెలిపారు. దరఖాస్తు నింపిన తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని దాచిపెట్టుకోవాలని వెల్లడించారు.








కామెంట్‌లు (0)