ఉత్తర కొరియా నేత కిమ్ పిలుపు
సియోల్ : వ్యూహాత్మక అణ్వాయుధాల విస్తరణకు ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ పిలుపిచ్చారు. బహుళ మిలటరీ మిషన్‌ల కోసం వ్యూహాత్మక అణ్వాయుధాలను అభివృద్ధిపరచాలని కోరారు. దేశ అణు సామర్ధ్యాలనేవి ఇప్పుడు ఒక స్థిరమైన వాస్తవమని, ఈ వాస్తవికతను గుర్తించడం లేదంటే వైఫల్యాన్ని అంగీకరిస్తున్నారని అర్ధమని ఆయన వ్యాఖ్యానించారు. అణు పదార్ధ ఉత్పత్తి, ఆయుధాల పరిశోధనా కేంద్రాల్లో పర్యటన సందర్భంగా కిమ్ పై వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా ఎన్నటికీ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని విడనాడదని స్పష్టం చేశారు. అమెరికా దాని మిత్రపక్షాలు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిలటరీ సహకారాన్ని, అణు సామర్ధ్యాలను విస్తరిస్తూ వస్తున్నాయని కిమ్ విమర్శించారు. అణ్వాయుధ దేశంగా ఉత్తర కొరియా హోదాను ఎవరైనా సవాలు చేస్తే యుద్ధాన్ని ప్రకటించినట్లుగానే భావిస్తామని ఆయన హెచ్చరించారు.








కామెంట్‌లు (0)