గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయువ గొంతులపై ఆంక్షలా?

33 నిమిషాల క్రితం

యువ గొంతులపై ఆంక్షలా? 
-  సౌరవ్ దాస్‌ను అడ్డుకోవడంపై ఎంఎ బేబీ ఆగ్రహం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 12:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సౌరవ్ దాస్‌ను అడ్డుకోవడంపై ఎంఎ బేబీ ఆగ్రహం

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) కో కన్వీనర్ సౌరవ్ దాస్‌ను ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డుకోవడాన్ని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ తీవ్రంగా ఖండించారు. యుకెలో విద్యార్థులు, విద్యావేత్తలతో సంభాషించేందుకు వెళ్లాల్సిన ఆయన ప్రయాణాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ మేరకు ఆయన గురువారం సోషల్‌ ‌మీడియా ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. ఏకపక్షంగా పాస్‌పోర్ట్ ఫ్లాగ్‌లు పెట్టడం, చివరి నిమిషంలో నోటీసులు ఇవ్వడం ద్వారా అసమ్మతి గళాలను, ముఖ్యంగా యువత గొంతును అణచివేయడానికి, భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని బేబీ పేర్కొన్నారు. ఇది భారతీయుల ప్రాథమిక హక్కులపై ప్రత్యక్ష దాడేనని అన్నారు. రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడేవారే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. జవాబుదారీతనం, రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతున్న దేశ విద్యార్థులు, యువతకు, సౌరవ్ దాస్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్