11 నుంచి దరఖాస్తుల ప్రారంభం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, డిఎస్సి కన్వీనర్ తమీమ్ అన్సారియా బుధవారం విడుదల చేశారు. 2,111 రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఎ),సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జిటి) పోస్టులు,350 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులు, వివిధ సొసైటీల పరిధిలో 260 ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 11 నుంచి అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో పరీక్ష జరగనుందని పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణ విధానం, ఫీజు చెల్లింపు, దరఖాస్తుల చివర తేదీల వంటి సమగ్ర వివరాలను tet2dsc.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.







కామెంట్‌లు (0)