ఎన్టీపీసీ గ్రీన్‌బెల్ట్ కోసం భూసేకరణపై రైతుల ఆందోళన
న్యాయమైన ధర కల్పించాలని ఆర్డీఓకు వినతి
ప్రజాశక్తి-కాకినాడ : ఎన్టీపీసీ గ్రీన్‌బెల్ట్ ఏర్పాటుకు తమ భూములను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నోటిఫై చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూసేకరణపై రైతులతో సమావేశం నిర్వహించకపోవడంపై అభ్యంతరం తెలిపారు. నోటిఫికేషన్ పత్రాలు అందడంతో విషయం తెలుసుకున్న రైతులు సోమవారం కాకినాడ ఆర్డీఓ మల్లిబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు తెలియకుండానే భూసేకరణ ప్రక్రియ చేపట్టారని, భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు న్యాయమైన, కనీస ధరతో పాటు తగిన పరిహారం అందించాలని కోరారు. రైతుల ఫిర్యాదుపై ఆర్డీఓ స్పందిస్తూ ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇరువర్గాలతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చోడిశెట్టి రాంబాబు, చోడిశెట్టి పెద్దకాపు, వేపకాయల తాతారావు, పేపకాయల రాజు, సానా పార్వతి, ఎర్ర శీను, సానా ఈశ్వరరావు, గణేష్ ఎంకన్న, సానా సత్తిరాజు, గౌతు గంగాధర్, పసుపులేటి గంగాధర్, చింతలపూడి మహాలక్ష్మి తదితర రైతులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)