ప్రజాశక్తి, విజయనగరం కోట : తాము కొనుగోలు చేసిన భూమిని (స్థలాన్ని) కాపాడండి అంటూ ఆర్మీ జవాన్ కలెక్టర్ గ్రీవెన్స్ లో సోమవారం అర్జీ పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం మండలం మూడుదాం గ్రామంలో ఉంటున్న అలమండ శ్రీనివాసరావు, అలమండ సత్యనారాయణ దేశ సేవలో ఆర్మీ జవాన్ గా సేవలందిస్తున్నారు. అయితే వీరు మలిచర్ల రెవిన్యూ పరిధి ముడుదాం గ్రామంలో 2026 16 అక్టోబర్ న సర్వే నంబర్ 5/29 లో 6.75 సెంట్లు భూమిని దేవాతి పట్నాయక్ కాకినాడకు చెందిన వ్యక్తి దగ్గర కొనుగోలు చేశారు. అయితే వారు ఇంటి దగ్గర లేకపోవడం చూసి అదే గ్రామానికి చెందిన టిడిపి నాయకులు మజ్జి శివ, మాజీ ఎంపీటీసీ మజ్జి పైడితల్లి తమ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూశారు. దాన్ని అడ్డుకున్న తమ ఇంటిపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. ఈ స్థలానికి గత 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయన్నారు. తాము మరల కొన్ని రోజుల్లో విధుల నిర్వహణకి వెళ్లాల్సి వుందని అన్నారు. తమ స్థలాన్ని కాపాడాలని తమకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టరేట్ గేటు వద్ద నిరసన చేపట్టారు.
‘మా భూమిని కాపాడండి’ ఆర్మీ జవాన్ వినతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 05, 2026, 04:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)