ప్రజాశక్తి - తిరుమల : నవంబర్ నెలకు సంబంధించి వివిధ దర్శన కోటా వివరాలను టిటిడి ఆదివారం ఒక ప్రటకనలో విడుదల చేసింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన కోటాను ఆగస్టు 18న ఉదయం పది గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 21న ఉదయం పది గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం పది గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. టిటిడి వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి ప్రకటనలో కోరింది.
నవంబర్ నెల దర్శన కోటా వివరాలు విడుదల
16 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 17, 2026, 12:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)