శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నీరుసరిపడా లేకపోవడమే ప్రమాదానికి కారణం

1 గంట క్రితం

sas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మృతుల కుటుంబాలకు రూ.50లక్షల పరిహారం

- కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ‘టాబ్లెట్ ఇండియా లిమిటేడ్‌ ‌హెల్త్‌ ‌కేర్‌’ పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి కారణం బాయిలర్‌‌లో నీరు సరిపడా లేకపోవడమేనని ప్రాథమిక దర్యాప్తు వివరాలను పరిశీలిస్తే తెలిసిందని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ‌తెలిపారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ పరిశ్రమలో ఏప్రిల్ 7వ తేదీన సేఫ్టీ ఆడిట్ జరిగిందని వెల్లడించారు. అన్ని ప్రమాణాలు సక్రమంగా ఉన్నాయని సర్టిఫై చేసినప్పటికీ, ఆపరేషన్ సమయంలో నీటి కొరత వల్లనే ఈ తీవ్ర ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోందని చెప్పారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన బాయిలర్ ఇన్‌స్పెక్టర్లతో పాటు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం తరపున రూ.50లక్షలు తక్షణ ఎక్స్‌‌గ్రేషియో అందిస్తామని ప్రకటించారు. అంత్యక్రియల తక్షణ ఖర్చుల నిమిత్తం వెనువెంటనే ₹1 లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్