ప్రజాశక్తి - ఎన్‌టిఆర్ జిల్లా : ఇంటర్ డిస్ట్రిక్ట్ 7వ మాస్టర్ ఛాంపియన్ షిప్ ట్రోఫీలో ఎన్టీఆర్ జిల్లా స్విమ్మర్లు సత్తా చాటారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసారావుపేటలో జరిగిన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించారు. ఈ సందర్భంగా విజేతలను పలువురు అభినందించారు. మొత్తంగా 23 స్వర్ణాలు, 10 రజతాలు, 8 కాంస్య పతకాలను సాధించిన టీమ్ స్విమ్మర్ల ప్రతిభను కొనియాడారు. 235 పాయింట్లతో ఎన్టీఆర్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా, తదుపరి కృష్ణా జిల్లా స్విమ్మర్లు 179 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచారు.
విజేతల్లో జి.శ్రీకాంత్ 6 గోల్డ్, డి.యుగంధర్ 4 గోల్డ్, 2 రజత పతకాలు దక్కించుకున్నారు. కే.ప్రవీణ్ కుమార్, జే.ఎస్.శరత్‌చంద్ర, ఎస్ .రమేశ్ 3 చొప్పున బంగారు పతకాలందుకున్నారు. ఎం.శ్రీకాంత్ 2 గోల్డ్ పతకాలు దక్కించుకోగా, వి.శ్రీనివాసరావు, కే.కిషోర్, పి.దుర్గారావు, వై.రామారావు ఒక్కో బంగారు పతకం సహా వివిధ పతకాలు సాధించి సత్తా చాటారు. ఇక మహిళల విభాగంగలో వి.సుహాసిని గోల్డ్ సహా మూడు పతకాలు అందుకున్నారు.
విజేతలను ఎన్టీఆర్, కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, ఇన్చార్జ్ అనిల్ కుమార్, సిమ్మింగ్ కోచ్ లు మాల్యాద్రి, లక్ష్మణ్ రావు తదితరులు అభినంందించారు. తదుపరి జాతీయ స్థాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబరచాలంటూ ప్రోత్సహించారు.





కామెంట్‌లు (0)