ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉప్పాడలో అర్ధరాత్రి వరుస చోరీలు

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 01:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 10కిపైగా దుకాణాల్లో చోరీ.. నగదు, సెల్‌ఫోన్లు అపహరణ

ప్రజాశక్తి - యు.కొత్తపల్లి: ఉప్పాడలో వరుస చోరీలతో ప్రజలు, వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలోని రింగ్‌రోడ్డు సమీపంలో శనివారం అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు వరుస చోరీలకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం దుకాణాలు తెరిచేందుకు వచ్చిన వ్యాపారులు చోరీలను గుర్తించారు.

రింగ్‌రోడ్డు సమీపంలోని 10కిపైగా దుకాణాల్లో చోరీలు జరిగినట్లు సమాచారం. సెలూన్‌, బట్టల దుకాణం, సెల్‌ఫోన్‌ షాప్‌, ఫ్యాన్సీ స్టోర్‌ తదితర దుకాణాల షట్టర్లు పగులగొట్టడంతోపాటు, కొన్ని దుకాణాల పైకప్పులను తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించి నగదు, సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రిని అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఒకే రాత్రి ఇన్ని దుకాణాల్లో వరుసగా చోరీలు జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ, నిఘాను మరింత పెంచాలని వారు కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దుకాణాలను పరిశీలించారు. చోరీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్