ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ముంబయిలో నేవీ కుటుంబం ఆత్మహత్య

2 గంటల క్రితం

Navy sailor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : భారత నౌకాదళ నావికుడు, ఆయన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించారు. నావికుడు, ఆయన భార్య, ఇద్దరు మైనర్ పిల్లల మృతదేహాలను దక్షిణ ముంబయిలోని నేవీ నగర్ ప్రాంతంలో ఉన్న నివాసంలో గుర్తించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. నావికుడి మృతదేహం ఒక గదిలో గుర్తించగా, అతని భార్య, రెండు నెలలు, మూడు సంవత్సరాల వయస్సు గల పిల్లల మృతదేహాలు కూడా అక్కడే లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో, ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగానూ, భార్య మరియు పిల్లలకు విషప్రయోగం జరిగినట్లుగానూ ప్రాథమిక విచారణలో గుర్తించామని అన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించామని, పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారని భారత నావికాదళం తెలిపింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్