ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి

1 గంట క్రితం

ycp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 01:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- ప్రత్తిపాడు: మాజీ మంత్రి, వైసిపి నేత ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను లోక్‌సభ సభ్యులు మిథున్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారు, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముద్రగడ సతీమణి పద్మావతి, కుమారులు బాలు, గిరిలను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో తోట నరసింహం, కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జక్కంపూడి రాజా తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్