ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న బహుళ ప్రయోజన విస్తరణ అధికారులు (ఎంపిఇఒ) 1,329 మంది కాంట్రాక్టు సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు లేదా గ్రామ వ్యవసాయ సహాయకులు (విఎఎ), గ్రామ ఉద్యాన సహాయకుల (విహెచ్‌ఎ) ఖాళీలను భర్తీ చేసే వరకు ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి వరకు వారి సేవలు కొనసాగనున్నాయని ఉత్తుర్వుల్లో పేర్కొంది. వ్యవసాయ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1,329 మంది బహుళ ప్రయోజన విస్తరణ అధికారుల సేవలను కొనసాగించాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం పొడిగింపునకు ఆమోదం తెలిపింది. సాధారణ నిబంధనలు, షరతులకు లోబడి కాంట్రాక్టు సేవల పొడిగింపు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. తదుపరి చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
ఎంపిఇఒల సేవలు ఏడాది పొడిగింపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 12:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)