సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసుల నిఘాలో ఒంగోలు

1 గంట క్రితం

ongole
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 11:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కలెక్టరేట్‌ చుట్టూ భారీ బందోబస్తు.. నగరానికి వచ్చే మార్గాల్లో క్షుణ్ణంగా తనిఖీలు

అర్ధరాత్రి నుంచే ప్రజాసంఘాల నేతలకు గృహ నిర్బంధం

ప్రజాశక్తి – ఒంగోలు సిటీ : తౌషిక్‌ అనుమానాస్పద మృతి, మౌలాబి ఆత్మహత్య ఘటనల్లో వాస్తవాలు వెలుగులోకి తేవాలని ప్రజాసంఘాలు తలపెట్టిన న్యాయపోరాటం నేపథ్యంలో ఒంగోలు నగరం పోలీసు వలయంలో చిక్కుకుంది. కలెక్టరేట్‌ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించడంతోపాటు, నగరానికి దారితీసే అన్ని మార్గాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ధర్నాను అడ్డుకునేందుకు అర్ధరాత్రి నుంచే ప్రజాసంఘాల నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు.మరి కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు .

తౌషిక్‌, మౌలాబి ఘటనలపై సీబీఐతో లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఎంఆర్‌పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ, అఖిలపక్ష నేతలు ఇచ్చిన పిలుపుతో సోమవారం ఒంగోలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వామపక్షాలు, ఎంఆర్‌పీఎస్‌, ఇతర ప్రజాసంఘాల నేతల కదలికలపై పోలీసులు ఆంక్షలు విధించారు . సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావును సైతం రాత్రి నుంచే నిర్బంధించి, వ్యక్తిగతపనులపై కూడా నిఘా ఉంచారు. నిరసనలను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం విస్తృతంగా బలగాలను మోహరించినట్లు తెలుస్తోంది. ప్రకాశం భవనం చుట్టూ సాయుధ బలగాలను రంగంలోదించారు. నగరం లో అప్రకటిత కర్ఫ్యు కొనసాగుతుంది.


ongole-1


ongole-2

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్