రవాణాశాఖ కమిషనరుకు హైకోర్టు ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి : పండగలు, వారాంతాల్లో ప్రైవేటు బస్సు నిర్వాహకులు.. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై పిటిషనర్ ఈ ఏడాది జులై 20న సమర్పించిన వినతిని పరిశీలించి రెండు నెలల్లో రాతపూర్వక ఉత్తర్వులివ్వాలని రవాణాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు పిల్‌ను పరిష్కరిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. పండగలు, వారాంతాలు, రద్దీ సమయాల్లో ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచి వసూలు చేస్తున్నాయని, దీనిని నియంత్రించేలా రవాణాశాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన చిట్టినేని సాంబశివరావు పిల్ దాఖలు చేశారు.







కామెంట్‌లు (0)