యూఏఈపై 70 పరుగుల తేడాతో ఘన విజయం
ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2026 టోర్నీలో భారత యువ జట్టు సత్తాచాటింది. యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. భారత విజయంలో ఆర్యవీర్ సెహ్వాగ్ (160) అద్భుత సెంచరీతో కీలక పాత్ర పోషించాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఆరంభంలో కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయ్‌చందాని 17 పరుగులకే వెనుదిరిగినా, ఆర్యవీర్ సెహ్వాగ్, వి.కె. వినీత్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 193 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆర్యవీర్ 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 160 పరుగులు చేయగా, వినీత్ 67 పరుగులు సాధించాడు. చివర్లో యశ్‌వర్ధన్ చౌహాన్ 17, అన్వయ్ ద్రావిడ్ 12 పరుగులతో రాణించారు.
310 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 50 ఓవర్లలో 239 పరుగులకే ఆలౌటైంది. అహ్మద్ ఖుదాదాద్ 74 పరుగులతో రాణించగా, నూర్‌ఉల్లా అయోబీ 39, యాపిన్ రాయ్ 29, కెప్టెన్ అయాన్ మిస్బా 27 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఇషాన్ సూద్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో భారత్ అండర్-19 ఆసియా కప్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది.








కామెంట్‌లు (0)