మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ప్రకటన
భువనేశ్వర్: భోపాల్ వేదికగా ఈనెల 19నుంచి జరిగే మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీకి హాకీ ఇండియా(హెచ్‌ఐ) జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్, గోల్ కీపర్ సవిత పూనియాకు విశ్రాంతినిచ్చి, ఆమె స్థానంలో బన్సారి సోలంకికి జట్టులో చోటు కల్పించింది. అనుభవజ్ఞురాలైన గోల్ కీపర్ సవిత పునియాకు భోపాల్‌లో జరిగే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి విశ్రాంతి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెడ్ కోచ్ స్జోర్డ్ మారిజ్నే తెలిపారు. అలాగే, ఈ టోర్నమెంట్ సందర్భంగా కొంతమంది క్రీడాకారుల వారు ఆడే స్థానాల్లోనూ మార్పులు చేశామన్నారు. 19 నుండి 28 వరకు భోపాల్‌లోని నాథు బర్ఖేడాలో నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ క్రీడా మైదానంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ బరిలోకి దిగుతోంది. తొలిరోజు భారత మహిళలజట్టు మలేషియాతో తన పోరాటాన్ని మొదలుపెట్టనుంది. మిడ్‌ఫీల్డర్ సలీమా టెటె సారథ్యంలో భారతజట్టు ఈ టోర్నీ బరిలో దిగనుండగా.. గత నెలలో జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని గెలిచిన అనంతరం మహిళలజట్టు పాల్గొంటున్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్ ఇదే. భారత మహిళలజట్టు 2016, 2023, 2024 ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆరు జట్లు పాల్గొనే ఈ టోర్నీలో భారత్, చైనా, జపాన్, మలేషియా, థాయిలాండ్ మరియు దక్షిణ కొరియా జట్లు ఉన్నాయి. భారత్, దక్షిణ కొరియా జట్లు మూడేసిసార్లు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాయి. 2024లో టైటిల్ నెగ్గిన జట్టులో సభ్యురాలు, గోల్‌కీపర్ 25 ఏళ్ల బన్సారీతోపాటు బిచ్చు దేవి ఖరిబామ్ తో పాటు మరో గోల్ కీపర్‌గా జట్టులో చోటు సంపాదించుకున్నారు. 21న కొరియా, 22న థాయ్‌లాండ్, 24న చైనా, 25న జపాన్‌తో భారతజట్టు తలపడనుంది. 27న సెమీఫైనల్స్, 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
జట్టు...
గోల్‌కీపర్లు: బన్సారీ సోలంకి, బిచ్ఛు దేవి.
డిఫెండర్లు: నిక్కి ప్రధాన్, జ్యోతి, జ్యోతి సింఘ్, సుశీలా ఛాను, లాల్‌థంతుంగీ, పూజా సాహో.
మిడ్‌ఫీల్డర్లు: రుతుజ, సునేలితా టొప్పో, సలీమా టేటే (కెప్టెన్), నేహా, సాక్షిరాణా, బల్జీత్ కౌర్, ఇషికా.
ఫార్వర్డ్సు: నవ్‌నీత్ కౌర్, దీపిక, బ్యూటీ దుంగ్‌దంగ్, లాల్‌రిమిసిమి, ముంతాజ్ ఖాన్.







కామెంట్‌లు (0)