రోమ్: 2028 లాస్‌ఏంజెల్స్ అథ్లెటిక్స్ పోటీల అర్హత, ఎంట్రీ, మొత్తం అథ్లెట్ల కోటా వివరాలను ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వరల్డ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ క్రీడల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు జూలై 15 నుండి 30 వరకు జరగనున్నట్లు తెలిపింది. అలాగే అథ్లెటిక్స్‌కు అంతర్జాతీయ ఆమోదించిన అర్హత మార్క్‌ను అథ్లెట్లు తప్పనిసరిగా అందుకోవాల్సిందేనని, అప్పుడే ఒలింపిక్స్ కు అర్హత సాధించనున్నట్లు పేర్కొంది. మహిళలకు 23 ఈవెంట్‌లు, పురుషులకు మరో 23 ఈవెంట్‌లు విడి విడిగా జరుగుతాయని, మిక్స్‌డ్‌కు కేవలం రెండు ఈవెంట్ జరుగుతాయని వెల్లడించింది. మిక్స్‌డ్ రిలే విభాగాలకు కేవలం 4×100, 4×400మీ. పోటీలు మాత్రమే జరుగుతాయని తెలిపింది. నలభై శాతం క్రీడాకారులు తప్పనిసరిగా ఒలింపిక్స్ అర్హత మార్క్‌ను అందుకోవాల్సిందేనని, మిగిలిన 60శాతం ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా భర్తీ చేయడం జరుగుతుందని వెల్లడించింది. ఒకవేళ ఈవెంట్ వారీగా నిర్దేశించిన కోటా కంటే ఎక్కువ మంది అథ్లెట్లు అర్హత ప్రమాణాలను అందుకుంటే, వారిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి మాత్రమే లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్ కోటా దక్కుతుందని తెలిపింది. దీంతో ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలను అందుకున్నంత మాత్రాన కోటా దక్కినట్లు సంతోషపడరాదని, తుది ప్రకటన వెలువడేవరకు అథ్లెట్లందరూ వేచిచూడాల్సిందేనని, ఏ ఒక్క అథ్లెట్లుకు ఒలింపిక్ బెర్త్ గ్యారెంటీ లేదని, అలాగే ప్రపంచ ర్యాంకింగ్‌ల ఆధారంగా ఏ అథ్లెట్లకూ అర్హత సాధించలేరని తాజా ప్రకటనలో పేర్కొంది.
Print EditionLos Angeles Olympics: అథ్లెటిక్స్ అర్హత వివరాలు వెల్లడి
-54 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 10, 2026, 11:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)