శ్రీలంకతో తొలిటెస్ట్
రావల్పిండి: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ భారీస్కోర్ నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 277 పరుగులతో మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 9 వికెట్ల నష్టానికి 434 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. సౌద్ షకీల్(93) తృటిలో సెంచరీ, ఘాజీ ఘోరి(48) అర్ధసెంచరీ మిస్ చేసుకున్నారు. మిన్హాస్(52) కూడా అర్ధసెంచరీతో రాణించడంతో పాక్ భారీస్కోర్ చేసింది. శ్రీలంక బౌలర్లు ఫెర్నాండో, మధుశంకకు మూడేసి, లాహిరు, రత్నాయకే, దినుషాకు ఒక్కో వికెట్ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక జట్టు రెండోరోజు ఆట ముగిసేసరికి 3వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కమిందు మెండీస్(40), ధనుంజయ(22) క్రీజ్‌లో ఉన్నారు. సూర్యభండార(0), ఛండీమాల్(1)కి తోడు లాహిరు ఉదాన(42) స్వల్ప స్కోర్లకే ఔటై పెవీలియన్‌కు చేరారు.







కామెంట్‌లు (0)