బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాజకీయ జోక్యం లేకుండా పింఛన్ల పంపిణీ చేపట్టాలి

1 గంట క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అధికారులే పంపిణీ చేయాలి

  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌కు సిపిఎం లేఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా, ప్రభుత్వ అధికారుల ద్వారా మాత్రమే ఈ నెల 30న పెన్షన్ల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30న ముందస్తుగా సామాజిక పింఛన్ల పంపిణీ చేపట్టాలని నిర్ణయించిందని, కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికలకు ఒకరోజు ముందు పెన్షన్ల పంపిణీ జరగనుందని, దీనిలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావు లేకుండా అధికారుల ద్వారా పారదర్శకంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందించే పెన్షన్లు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన సంక్షేమ ప్రయోజనమని తెలిపారు. వీటిని రాజకీయ ప్రచారానికి లేదా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని, ఈ మేరకు ఆదేశాలివ్వాలని కోరారు. కొంతకాలంగా అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు దగ్గరుండి పెన్షన్లు పంపిణీ చేయిస్తున్నారని, ఆయా పార్టీలు ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌కు ఇది విరుద్ధమని పేర్కొన్నారు. అలాంటి ప్రచార జోక్యానికి అవకాశం లేకుండా, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మాత్రమే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా పంపిణీ ప్రక్రియను నిర్వహించాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడికీ, ఎలాంటి వివక్ష లేకుండా పెన్షన్లు అందేలా పర్యవేక్షించాలని కోరారు. తక్షణమే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, రాజకీయ జోక్యానికి తావులేకుండా పంపిణీ జరిగేలా చూడాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్