బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionWorld Wrestling Championships: నీలమ్‌, కాజల్‌కు రజత పతకాలు

1 గంట క్రితం

NeelamSirohiKajalDhochak-1793205081221-6009.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 10:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రెజ్లింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌

అస్టనా(కజకిస్తాన్‌): రెజ్లింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన నీలమ్‌ సిరోహి, కాజల్‌ ఢోచక్‌ రజత పతకాలు సాధించారు. బుధవారం జరిగిన 48-50కిలోల విభాగం ఫైనల్లో 26ఏళ్ల నీలమ్‌ జపాన్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్‌ చేతిలో పోరాడి ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో నీలమ్‌ కేవలం ఒక్క పాయింట్‌ తేడాతో ఓడి తృటిలో బంగారు పతకాన్ని చేజార్చుకొని రజత పతకానికి పరిమితమైంది. అంతకుముందు జరిగిన 76కిలోల ఫైనల్లో 18ఏళ్ల కాజల్‌ ఉక్రెయిన్‌కు చెందిన అనస్టేసియా చేతిలో 6-8పాయింట్ల తేడాతో పోరాడి ఓడింది. ఒక దశలో కాజల్‌ 4-4పాయింట్లతో సమంగా నిలిచింది. చివరి 30 సెకన్లలో ఉక్రెయిన్‌ రెజ్లర్‌ రాణించడంతో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో వీరిద్దరితోపాటు అన్షుమాలిక్‌ ప్రాతినిధ్యం వహించగా.. ఆమెకు కూడా 57కిలోల విభాగంలో రజత పతకం లభించిన సంగతి తెలిసిందే. ఇక రంజిత 65 కిలోల విభాగంలో ప్రాతినిధ్యం వహించి సెమీస్‌లో 2-6తో జపాన్‌కు చెందిన ననా ఇకేహితా చేతిలో ఓడి కాంస్య పతకానికి పరిమితమైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్