మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపింఛన్‌ ‌విభజన!

57 నిమిషాల క్రితం

images.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 12:40 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • బ్యాంకు ఖాతాలకు కేంద్రవాటా

  • రాష్ట్రం ఇచ్చే మొత్తం ఇళ్ల వద్దకు

  • ఎన్‌ఎస్‌ఎపి లబ్ధిదారులకు తిప్పలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (నేషనల్‌ ‌సోషల్‌ అసిస్టెన్స్‌ ‌ప్రోగ్రామ్‌ -ఎన్‌ఎస్‌ఎపి) లబ్ధిదారులకు ఇక నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా ఇవ్వనున్నాయి. తనవాటాను విడిగా బ్యాంకుల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడమే దీనికి కారణం. రాష్ట్రంలో ఇప్పటిదాకా సచివాలయ సిబ్బందే ఇళ్ల వద్దకు వచ్చి పింఛను మొత్తాన్ని అందచేస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో కూడా ఆ విధానం కొనసాగనున్నప్పటికీ వారు అందచేసే మొత్తం తగ్గనుంది. సామాజిక పింఛన్లలో తనవంతుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్నే ఇక నుండి సచివాలయ సిబ్బంది అందచేస్తారు. కేంద్రం వాటా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమకానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు అందడంతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఎక్స్‌ అపిషియో కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం నాడు మోమోను జారీ చేశారు. జులై నుండే ఈ విధానాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించినట్లు చెబుతున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఎపి) పరిధిలో రాష్ట్రంలో 9.34 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి సంబంధించిన 382.82 కోట్ల రూపాయల వాటాను అక్టోబర్‌ ఒకటవ తేది నుండి కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేయనుంది. దీంతో ఈ లబ్దిదారులకు బ్యాంకు ఖాతా తప్పని సరి కానుంది. వీరిలో ఎందరికి బ్యాంకు ఖాతా ఉంది, ఎందరికి లేదన్న సమాచారం ప్రస్తుతానికి అధికారుల వద్ద లేదు. ఖాతాలు లేని వారందరు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్‌ఎస్‌ఎపి లబ్ధిదారులు వారి బ్యాంకు ఖాతాల క్రీయాశీలం చేసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలన, ఎంఎస్‌ఎంఇ శాఖల కొండపల్లి శ్రీనివాస్‌ ‌సూచించారు.

ఏ పింఛను ఎంత...?

ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను లబ్ధిదారులకు 60 నుంచి 79 ఏళ్లు వయస్సులోపు వారికి కేంద్ర వాటా (బ్యాంకులో) రూ.200, రాష్ట్ర వాటా (ఇంటి వద్ద నగదు) రూ.3,800 చెల్లిస్తారు. 80 ఏళ్లు.. పైబడిన వారికి కేంద్ర వాటా (బ్యాంకులో) రూ.500, రాష్ట్ర వాటా (ఇంటి వద్ద నగదు) రూ.3,500 చొప్పున మొత్తం పింఛను రూ.4 వేలు అందజేస్తారు. ఇందిరా గాంధీ జాతీయ వితంతు పింఛను లబ్ధిదారులకు రూ.40 నుంచి 79 ఏళ్లు వయస్సులోపు వారికి కేంద్ర వాటా (బ్యాంకులో) రూ.300, రాష్ట్ర వాటా (ఇంటి వద్ద నగదు) రూ.3,700 చొప్పున మొత్తం పింఛను రూ.4 వేలు, 80 ఏళ్లు, పైబడిన వయస్సు వారికి కేంద్ర వాటా (బ్యాంకులో) రూ.500, రాష్ట్ర వాటా (ఇంటి వద్ద నగదు) రూ.3,500 చొప్పున మొత్తం పింఛను రూ.4 వేలు చెల్లిస్తారు. ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పింఛను లబ్ధిదారులకు 18 నుంచి 79 ఏళ్లు వయస్సు వారికి కేంద్ర వాటా (బ్యాంకులో) రూ.300, రాష్ట్ర వాటా (ఇంటి వద్ద నగదు) రూ.5,700 చొప్పున మొత్తం పింఛను రు. 6 వేలు, 80 ఏళ్లు, పైబడిన వయస్సు వారికి కేంద్ర వాటా (బ్యాంకులో) రూ.500, రాష్ట్ర వాటా (ఇంటి వద్ద నగదు) రూ.5,500 చొప్పున మొత్తం పింఛను రూ. 6 వేలు అందజేస్తారు.

ఎన్‌‌టిఆర్‌ ‌భరోసాలో మార్పు లేదు!

ఎన్‌‌టిఆర్‌ ‌భరోసా పథకం కింద రాష్ట్రంలో 53 లక్షల మంది పింఛన్లు అందుకుంటున్నారని, వారికిచేచ మత్తాన్ని యథావిధిగా ఇంటి వద్దే చెల్లిస్తామని, దానిలో ఎటువంటి మార్పులేదని అధికారులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్