మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎన్నికల అక్రమాలను ప్రజలు చూశారు..

5 రోజుల క్రితం

‘రిగ్గింగ్‌ మాస్టర్‌’ చంద్రబాబు : జగన్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 12:25 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నాయకులతో వైపిపి అధినేత జగన్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశారని వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పలు జిల్లాలకు చెందిన వైసిపి నాయకులు బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌‌ను కలిశారు. స్థానిక ఎన్నికలు జరిగిన తీరుపై వారితో జగన్‌ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార కూటమి ఎన్ని అక్రమాలకు పాల్పడినా వైసిపి కార్యకర్తలు కష్టపడి పనిచేశారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనట్లు నామినేషన్లను చించేశారని, అనర్హులుగా ప్రకటించారని, గెలిచినా ఓడినట్లు చూపారని అన్నారు. అయినా ఎన్నికల కోసం కార్యకర్తలు కసితో పనిచేశారని తెలిపారు. 2024 ఎన్నికలతో పోలిస్తే వైసిపి ఓటింగ్‌ ‌శాతం పెరిగిందని అన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ దగ్గర నుంచి, ఓట్ల లెక్కింపు వరకూ ప్రతీ దశలోనూ దాడులు, దౌర్జన్యాలు జరిగాయని పేర్కొన్నారు. ఓటింగు వస్తే ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే భయంతోనే ముఖ్యమంత్రి ఎన్నికలను ఏకపక్షంగా జరిపించేందుకు కుట్ర పన్నారని అన్నారు. అక్రమాలను ఎదుర్కొని పనిచేసిన చోట్ల ఫలితాలు తారుమారు చేశారని పేర్కొన్నారు. వైసిపి హయాంలో అక్రమాలు జరిగాయంటూ నిందలు మోపి, లేని అబద్ధాలు చెప్పి ఈ ఎన్నికల్లో చేసిన అరాచకాలు, అక్రమాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో చెల్లని ఓట్ల పేరిట చాలా వరకు వైసిపి ఓట్లు తీసేశారని, లెక్కింపు కేంద్రాల్లో కరెంటు ఆపి మరీ ఫలితాలు తారుమారు చేశారని విమర్శించారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్లకు బదులు బౌన్సర్లను పెట్టారని, అభ్యర్థుల బంధువులను కిడ్నాప్‌ చేసి, నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి తెచ్చారని తెలిపారు.చెల్లని ఓట్ల పేరిట చాలా వరకు వైసిపి ఓట్లు తీసేశారని అన్నారు. వైసిపి గెలిచిన చోట పదేపదే రీకౌంటింగ్‌ చేసి, లెక్కలు తారుమారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి అడిగిన చోట రీకౌంటింగ్‌ చేయలేదని అన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా అదనపు బ్యాలెట్‌ పేపర్లు ఇచ్చి, వారిని గెలిపించేలా అక్రమాలు చేశారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ఎన్నికల బాధితులు ఉన్నారని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్