విశాఖ : దేశాభివృద్ధికి పోర్టులు చాలా ముఖ్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విశాఖలో రెండో రోజు జరుగుతున్న సిఐఐ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ... సుదీర్ఘ తీర ప్రాంతం, పోర్టులు ఉండటం ఎపి కి చాలా ఉపయోగం అని అన్నారు. రాష్ట్రంలోని అనేక పోర్టులను మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైవేలు, గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లు.. ఎపి కి ఎంతో ఉపయోగంగా ఉన్నాయని తెలిపారు. ఎగుమతులు, దిగుమతుల అభివృద్ధికి లాజిస్టిక్స్ ఖర్చు బాగా తగ్గాలన్నారు. బెంగళూరు-విజయవాడ కారిడార్‌తో 110 కిలోమీటర్ల దూరం తగ్గిందన్నారు. రాయపూర్-విశాఖ కారిడార్ ప్రాజెక్టు 96 శాతం పూర్తయ్యిందన్నారు. ఇది ఎపి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు ఎంతో మేలు చేస్తుందన్నారు. విశాఖ-మచిలీపట్నం కారిడార్.. ఎపి అభివృద్ధికి కీలకం అని చెప్పారు. భవిష్యత్తులో ఎపి అభివృద్ధిలో పోర్టులే ప్రముఖ పాత్ర వహిస్తాయన్నారు. వచ్చే జనవరి నాటికి బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ వే పూర్తవుతుందని ప్రకటించారు. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేతో తమిళనాడు, ఎపి, కర్నాటకకు లాభం అని అన్నారు. ఖరగ్‌పూర్-అమరావతి కారిడార్ వస్తే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నారు. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు మేలు కలుగుతుందని చెప్పారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపేందుకు అనేక కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. అమరావతి చుట్టూ 192 కిలోమీటర్ల రింగ్‌రోడ్డు వస్తోందని ప్రసంగించారు.
దేశాభివృద్దికి పోర్టులు చాలా ముఖ్యం : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
13 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026, 04:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)