న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడి తన మొబైల్‌ను ట్యాప్ చేయిస్తున్నారని.. దీనికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శుక్రవారం నిర్వహించిన ‘ఆస్క్ మి’ (Ask me) కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తన ఫోన్‌ను పైకి ఎత్తి చూపిస్తూ.. ట్యాపింగ్ జరిగినట్లు ఇందులో ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తనపై నిఘా ఉన్న విషయం ప్రధాని మోడి కి తెలుసు అని పేర్కొన్నారు. మోడి తనతో ముఖాముఖి చర్చకు రావాలని రాహుల్ సవాల్ విసిరారు. విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరు ఉన్నారో తెలుస్తుందని, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఎవరు పాల్గొన్నారో తెలుస్తుందని రాహుల్ అన్నారు. తనతో చర్చకు వచ్చే ధైర్యం మోడి కి లేదని, ఆయన స్క్రిప్టు చూసి మాట్లాడుతారని ఆరోపించారు. ఎక్కడైనా పర్వాలేదని, టెలిప్రాంప్టర్‌ను తీసుకువచ్చి డిబేట్‌లో పాల్గొనాలని, వారికి నచ్చిన జడ్జీని పెట్టాలని రాహుల్ కోరారు. నిజమైన దేశద్రోహి ఎవరో తెలియాలంటే, చర్చకు రావాల్సిందే అని రాహుల్ సవాల్ విసిరారు. తనతో నేరుగా చర్చలో పాల్గొంటే, ప్రధాని మోడి రాజకీయ కెరీర్ ముగుస్తుందని రాహుల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలను బిజెపి తప్పుపట్టింది. కేరళ బిజెపి చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్ తన తలకు వైద్య పరీక్ష చేయించుకోవాలని సూచించారు. రాహుల్ ఫోన్ ఎవరూ ట్యాప్ చేయరు అని, అంత ఆసక్తి ఎవరికి లేదని, ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఆయన బ్రెయిన్ ఎందుకిలా రోజూ అబద్ధం చెబుతుందో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.
నా ఫోన్ ను ట్యాప్ చేయిస్తున్నారు : రాహుల్ గాంధీ
29 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026, 03:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)