శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడ నగరపాలక సంస్థ, పంచాయతీల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్

20 నిమిషాల క్రితం

Elaborate arrangements in place for Kakinada Municipal Corporation and Panchayat elections District Collector Harendhira Prasad
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 04:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

...కాకినాడలో 66 వార్డులు, 306 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ

...ఈ నెల 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు

... జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వెల్లడి


ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంతంగా, అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు చర్యలను వేగవంతం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ కేంద్రంలో కలెక్టర్ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని మేయర్, 66 వార్డులకు గాను మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26వ తేదీన పోలింగ్ నిర్వహించి, 30వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను స్థానిక రంగరాయ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించనున్నామన్నారు. ఈనెల 14, 15, 16 తేదీలలో నామినేషన్లను స్వీకరిస్తామని 17వ తేదీన పరిశీలించి నిర్వహించి 19న ఉపసంహరణల పూర్తి చేస్తామని చెప్పారు. మేయర్ స్థానానికి నగరపాలక సంస్థ కార్యాలయంలో, కార్పొరేటర్ అభ్యర్థులకు 17 చోట్ల నామినేషన్ స్వీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.


...గ్రామ పంచాయతీల ఎన్నికలపై ...

కాకినాడ జిల్లాలో 385 గ్రామ పంచాయతీల గాను 379 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయని ఆరు వివిధ కారణాల రీత్యా ఎన్నికల జరగటం లేదన్నారు. ఈనెల 26న మొదట విడతగా 93 గ్రామ పంచాయతీలకు, రెండో విడతలో ఈనెల 29వ తేదీన 149 గ్రామపంచాయతీలకు, మూడో విడత డిసెంబర్ రెండవ తేదీన 137 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించి తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపడతామని కలెక్టర్ చెప్పారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించిందని 5 వేల లోపు 15 లక్షలు, 5వేలు నుండి 10 వేల జనాభా ఉంటే 25 లక్షలు, 10 వేలు దాటి జనాభాకు 50 లక్షల రూపాయలను ప్రభుత్వం ప్రోత్సహక బహుమతిగా అందిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో కాకినాడ నగర, జిల్లా ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని, అధిక శాతం పోలింగ్ నమోదయ్యేలా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. నామినేషన్లు వేయనీయకుండా భయభ్రాంతులకు గురిచేసినా, అల్లర్లు, బెదిరింపు చర్యలు భయ బ్రాంతులకు గురి చేస్తే అరికట్టే నిమిత్తం ఒక కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 89788 45559 నెంబరుకు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్