మంగళవారం, 15 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్

1 గంట క్రితం

konaseema
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 12:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

28 అర్జీలు స్వీకరించిన మంత్రి సుభాష్

ప్రజాశక్తి - రామచంద్రపురం : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కరించడానికి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మంగళవారం రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కు 28 అర్జీలు వచ్చాయి. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి నేరుగా వివరించి, పరిష్కారం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. వాటిలో రోడ్లు, డ్రైన్లు, ఇళ్ల స్థలాలు మొదలైన సమస్యలపై అర్జీలు అందాయి. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని మంత్రి సుభాష్ పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ప్రజాదర్బార్ నిర్వహించడం ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ అందరికీ అందుబాటులో ఉండే పాలనకు మంత్రి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరంతరం కృషి చేస్తామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్, రామచంద్రపురం మండల టీడీపీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, కూటమి నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్