ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రక్షణ, మౌలిక వసతుల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశించారు. తుపాను ప్రభావంతో దాదాపు 15 జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో రానున్న రెండు, మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో చెరువులు, కాలువల గట్లకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గే వరకు సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
రాధాకు పవన్ జన్మదిన శుభాకాంక్షలు
జనసేన నాయకులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాధాకృష్ణ నాయకత్వంలో విజయవాడ నగరం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.







కామెంట్‌లు (0)