33 వేల టికెట్లు.. 84 లక్షల దరఖాస్తులు..
దుబాయ్: భారత్, పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్ మ్యాచ్ టికెట్లకోసం రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈమేరకు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే ఈ మ్యాచ్‌కోసం ఆన్‌లైన్‌లో 84లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ప్రకటించారు. కేవలం 34వేలమంది మాత్రమే కూర్చుని వీక్షించే అవకాశమున్న జొహన్నెస్‌బర్గ్‌లోని వాండెరెర్స్ స్టేడియంలో భారీ స్థాయిలో దరఖాస్తులు రావడం గమనార్హం. ఇరుజట్ల మధ్య ఈ మ్యాచ్ నవంబర్ 21, 2027న జరగనుండగా.. సుమారు 193 దేశాల నుంచి ఈ మ్యాచ్ టికెట్లను దక్కించుకొనేందుకు ఇంతమంది దరఖాస్తు చేసుకోవడంతో నిర్వాహకులు విస్తుపోతున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరగనుండగా.. 2027 ఐసిసి వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21వరకు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికలుగా జరగనుంది. వన్డే ప్రపంచకప్‌లో భారత్ గత 9మ్యాచుల్లో పాకిస్తాన్‌పై విజయాలను నమోదు చేసుకుంటోంది. ఇక 23ఏళ్ల తర్వాత దక్షిణాఫిక్రా ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనుండగా.. 2027 ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు జింబాబ్వే, నమీబియా కూడా సహా ఆతిథ్య హోదా జట్లుగా ఉన్నాయి.







కామెంట్‌లు (0)