మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రజా సమస్యలకై పోరాటమే ప్రచారం

1 గంట క్రితం

ప్రజా సమస్యల పోరాటమే ఎజెండాగా సిపిఎం ప్రచారం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 11:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పలు జిల్లాల్లో సిపిఎం విస్తృత ప్రచారం

​ప్రజాశక్తి - యంత్రాంగం : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రచారం చివరి రోజైన మంగళవారం సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని పార్టీ నాయకులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు, పార్టీ శ్రేణులు ర్యాలీలు, పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను కలిశారు. గ్రామాల అభివృద్ధికి, ప్రజల హక్కుల పరిరక్షణకు కమ్యూనిస్టుల పోరాటాలను గుర్తించి మద్దతివ్వాలని కోరారు. నెల్లూరు జిల్లా ఎంపిటిసి అభ్యర్థులు గరికపాటి సురేష్, వంజివాక సరితమ్మను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, కార్యదర్శివర్గ సభ్యులు ఎం మోహనరావు కోరారు. rతిరుపతి జిల్లా రేణిగుంట 3వ సెగ్మెంట్‌లో ఎంపిటిసి అభ్యర్థి బలిపంగి భారతి.. తొట్టంబేడు మండలం బోనుపల్లి ఏకగ్రీవ ఎంపిటిసి సభ్యులు చాముండేశ్వరితో కలిసి ప్రచారంలో ఓటర్లను అభ్యర్థించారు.

కర్నూలు జిల్లా ఆదోని మండలం అభ్యర్థులు గరికపాటి సురేష్, వంజివాక సరితమ్మ ప్రచారం నిర్వహించారు. ఎంపిటిసి అభ్యర్థులు బి పద్మ, ఇ వీరేష్, పి దస్తగిరమ్మలకు మద్దతుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. ప్రభాకర్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు.

విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని పోరాం, పెదమేడపల్లి, పెదచామలాపల్లి, ఇద్దనవలస, చల్లపేట, కైలాం, ఆండ్ర, లోతుగెడ్డ గ్రామాల్లో సిపిఎం జెడ్ పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు.

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని సంగంవలస–రావికోన పంచాయతీ ఎంపిటిసి అభ్యర్థి హిమరిక లక్ష్మణరావు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఇరిడి, చెముడుగూడ ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ, గుమ్మలక్ష్మీపురం మాజీ జెడ్‌పిటిసి కె లక్ష్మి ప్రచారం నిర్వహించారు. జెడ్పిటిసి అభ్యర్థి మండంగి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం జెడ్‌పిటిసి అభ్యర్థి తెల్లం నాగమణి, పాలకోడేరు మండలంలో జెడ్‌పిటిసి అభ్యర్థి శేషపు అశ్రియ్య, పెనుమంట్ర జెడ్‌పిటిసి అభ్యర్థి కేతా గోపాలన్‌, నరసాపురం జెడ్‌పిటిసి అభ్యర్థి కవురు లక్ష్మి విస్తృత ప్రచారం సాగించారు. కుక్కునూరు రూరల్లోని మాధవరం ఎంపిటిసి అభ్యర్థి సోడే బాలరాజు గెలుపు కోరుతూ జోరు వర్షంలోనూ ప్రచారం నిర్వహించారు. పాలకోడేరు మండలంలోని మోగల్లు ఎంపిటిసి అభ్యర్థులు చల్లా శ్రీనివాస్, గెద్దాడ వెంకటేశ్వరరావు వర్షంలోనూ విస్తృత ప్రచారం సాగించారు. విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండల కేంద్రంలో జెడ్‌‌పిటిసి అభ్యర్థి కొర్రా త్రినాధ్‌‌ను గెలిపించాలంటూ చేపట్టిన భారీ ర్యాలీని ఉద్దేశించి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం మాట్లాడారు. డుంబ్రిగుడ మండలంలో గసభ పంచాయతీ మోర్రిగూడలో నిర్వహించిన ప్రచారంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర పాల్గొన్నారు. పోలవరం జిల్లాలో మారేడుమిల్లి జెడ్‌‌పిటిసి అభ్యర్థి మట్ల వాణిశ్రీ ప్రచారం నిర్వహించారు. జికె వీధి మండలం దామనపల్లి, పెడవలస పంచాయతీ పరిధి జెడ్‌‌పిటిసి అభ్యర్థి అంపురంగి బుజ్జిబాబుకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి రాంభూపాల్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. విఆర్ పురం జెడ్‌‌పిటిసి అభ్యర్థి కారం సుజాత, ఎంపిటిసి అభ్యర్థి కారం సుందరయ్య, చింతూరు జెడ్‌‌పిటిసి అభ్యర్థి మిడియం శ్రీదేవి విస్తృత ప్రచారం చేశారు. అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం కొత్తపట్నం గ్రామంలో జెడ్‌పిటిసి అభ్యర్థి మైలపల్లి లక్ష్మి, కొత్తపట్నం ఎంపిటిసి అభ్యర్థి ధోని లక్ష్మిలను గెలిపించాలని కోరుతూ సిపిఎం నాయకులు ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్