మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ కేసులో పురోగతి

15 గంటల క్రితం

arrest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 10:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కరస్పాండెంట్‌ ‌కుమారుడు, వార్డెన్ అరెస్ట్

ప్రజాశక్తి -శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : విద్యార్థి తౌషిక్‌ ‌మృతి, అతని తల్లి ఆత్మహత్య నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు శింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ కరస్పాండెంట్ కుమారుడు, ఆ కోచింగ్ సెంటర్ హాస్టల్ వార్డెన్ ని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ కు సంబంధించి సెంటర్‌లో నవోదయ కోచింగ్ తీసుకుంటున్న కనిగిరికి చెందిన తౌసిక్ అనే విద్యార్థి ఫిబ్రవరి 14న పాఠశాలలో మరణించిన విషయం తెలిసిందే. ఆ తరువాత విద్యార్థి తల్లి మౌలాబీ... తమ బిడ్డ చావుకు కారణం తెలపాలని పోరాటం చేస్తూ సెప్టెంబర్ పదిన కోచింగ్ సెంటర్ ముందు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కోచింగ్ సెంటర్ కరస్పాండెంట్ కుమారుడు వాక చైతన్య, హాస్టల్ వార్డెన్ బాబ్జీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు కూడా ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్