గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Rains - రాబోయే 3 గంటల్లో వానలు ..!

1 గంట క్రితం

Rain expected in the next 3 hours..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 05:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : రాబోయే 3 గంటల్లో ఎపిలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని చిత్తూరు, పుత్తూరు, సత్యవేడు, శ్రీసిటీ, తడ పరిసర ప్రాంతాలలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దానితోపాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ ప్రకటించింది. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు చెదురుమదురుగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.
rains alert

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్