అమరావతి : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో .... ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న కొన్ని గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాగల 6 గంటలపాటు శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు ఉన్న జిల్లాల్లో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో రాగల రెండు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వర్షాలతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. పైన పేర్కొన్న మూడు జిల్లాలు మినహా మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరికల దృష్ట్యా, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Rains - ఎపి లో వానలు ...
22 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 04:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)