శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్తమ ఉపాధ్యాయునిగా కత్తుల వీర్రాజు ఎంపిక

27 నిమిషాల క్రితం

Kattula Veerraju selected as Best Teacher.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 04:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గోకవరం (తూర్పు గోదావరి) : ఉత్తమ ఉపాధ్యాయునిగా కత్తుల వీర్రాజు ఎంపికయ్యారు. శనివారం తెలిపిన వివరాల ప్రకారం .... రంపయర్రంపాలెం గ్రామానికి చెందిన కత్తులు వీర్రాజు పెంటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని చేయూత చారిటబుల్ ట్రస్ట్ వారు అందజేశారు. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కాకినాడ ఆర్ జె డి నాగమణి, చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మొండి రవికుమార్ చేతుల మీదుగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రంప ఎర్రంపాలెం గ్రామ పెద్దలు, నాయకులు, వీర్రాజుని అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్