తిరుపతి జెన్ జీ (విద్యార్థులు)పై పోలీసుల దాడులు ఖండించండి : ఎస్ఎఫ్ఐ
తిరుపతి : పారా మెడికల్ విద్యార్థుల సమస్యల పై ప్రజాస్వామ్యయుక్తంగా నిరసన తెలిపుతున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై అలిపిరి పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. శనివారం తిరుపతి పారా మెడికల్ కళాశాల విద్యార్థులు, SFI తిరుపతి జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో రూయ నుంచి అలిపిరి వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని, స్టైఫండ్ ఇవ్వాలని, అకాడమిక్ సకాలంలో పూర్తి చేయాలనీ డిమాండ్స్ తో విద్యార్థులు నిరసన చేపడితే ఢిల్లీలో పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించిన రీతిగా .... తిరుపతి పోలీసులు కూడా అత్యుత్సాహం చూపి విద్యార్థినిలు అని కూడా చూడకుండా వారి జుట్టు పట్టుకొని లాగి, అమానుషంగా దాడులు చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు.







కామెంట్‌లు (0)