శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Teaser - 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్

32 నిమిషాల క్రితం

adarsa kutumbam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 04:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్. తాజాగా టీజర్ విడుదల చేసి థియేటర్లలోకి వచ్చే విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. అక్టోబరు 2వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్‌ ను చూస్తే .... కుటుంబ నేపథ్యంతో కూడిన వినోదం, యాక్షన్, చమత్కారమైన సంభాషణలతో ఆద్యంతం ఆకట్టుకునేలా టీజర్ ఉంది. మధ్య తరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు.. వాటి చుట్టూ అల్లుకున్న వినోదం.. ఇలా ‘ఆదర్శ కుటుంబం – AK47’ ప్రపంచాన్ని టీజర్ ఆసక్తికరంగా పరిచయం చేసింది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్‌ చమత్కారమైన రచన, పదునైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో టీజర్‌లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్