- పల్లపు ప్రాంతాలు, ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సిటీ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రాజమహేంద్రవరంలోని హైటెక్ బషల్టర్ తుమ్మలావ ఆర్యాపురం మూల గొయ్యి ప్రధాన బస్టాండు పోర్టు గేటు రైల్వే స్టేషన్ ప్రాంతాలు వర్షపు నీటిలోనే ఉన్నాయి. రైల్వే స్టేషన్ సమీపంలోని పోర్టు గేటు వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రైల్వే గేట్ క్రింద నుంచి రోడ్డు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే ఇక్కడ సమస్య ఏర్పడుతుంది. గత రెండు రోజులుగా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షానికి భారీగా నీరు చేరింది. గేటు కింద బాగా పలుకు ప్రాంతం ఉండడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది వాహనాల రాకపోకలకు ఎవరా అంతరాయం ఏర్పడుతుంది. కనీసం అరగంట సమయమైనా పడుతుంది. ఈ సమస్య ఈనాటిది కాదు. ఎన్నో సంవత్సరాలుగా చిన్నపాటి వర్షానికి ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంది. ప్రభుత్వాలు, నగరపాలక సంస్థ పాలకవర్గాలు ఎన్ని మారినా సమస్య పరిష్కరిస్తామని వాగ్దానాలు ఇవ్వడం తప్ప శాశ్వత పరిష్కారం నేటికి సాధ్యం కాలేదు. సమస్య వచ్చినప్పుడు పాలకులు అధికారులు హడావుడి చేయడం తప్ప చిత్తశుద్ధితో పరిష్కరించిన దాఖలు లేవు. మరోవైపు ఏపీ పేపర్ మిల్ సమీపంలోని ఇందిరానగర్ ముంపునకు గురైంది వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది ప్రస్తుతం 66 వార్డులో ఉన్న (పాత 45 వార్డు) ఇందిరా నగర్ పూర్తిగా వర్షం నీటితో నిండిపోయి ముంపునకు గురైంది. రోడ్లు డ్రైనేజీలు కనిపించని పరిస్థితి ఏకంగా ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. రెండు రోజులుగా ఇందిరానగర్ వాసులు అనేక కష్టాలు అనుభవిస్తున్నారు వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో కనీసం వంట కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడ్డాయి. ఇందిరానగర్ లో ఏర్పడిన ఈ పరిస్థితితో ప్రజలు అధికారులు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కాలనీ చుట్టుపక్కల ప్రాంతాలకు అతి లోతైన ప్రాంతం ఇక్కడ కురిసిన వర్షపు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు ఈ కాలనీకి ఆనుకుని డంపింగ్ యార్డ్ ఉండడంతో ఈ వర్షానికి తడిసిపోయిన చెత్త సదరు నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే విష జ్వరాలు ప్రబల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వర్షపు నీటిని బయటకు పంపించేందుకు మోటర్లు ద్వారా పంపింగ్ చేసే వారిని రాను రాను కార్పొరేషన్ శాఖ అధికారులు ఆ విధానంపై దృష్టి పెట్టడం తగ్గించారని స్థానికులు చెప్తున్నారు. గతంలో పాలకవర్గం ఉండేదని ఇటువంటి సంఘటన జరిగితే స్థానిక నాయకులకు తెలిపే వారమని అయితే గత తొమ్మిదేళ్లుగా ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి అంటున్నారు. అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు కోట్లాది రూపాయల ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు తప్ప ఇందిరా నగర్ కి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. తమను తమ కాలనీని ముంపు బారి నుండి రక్షించలని వేడుకుంటున్నారు. వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో ఇళ్లలో ఉన్న మొత్తం సామాగ్రి పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







కామెంట్లు (0)