మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అందరి చూపు నార్పల మేజర్ పంచాయతీ వైపు

13 నిమిషాల క్రితం

All eyes are on Narpala Major Panchayat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 03:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తుది బరిలో చిలమకూరు గోపాల్, గవ్వల రమాదేవి... విజయం పై ఎవరి ధీమా వారిదే...


ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రం అయిన నార్పల మేజర్ పంచాయతీ వైపు అందరి చూపు ఉంది. చిత్రవిచిత్రంగా పలువురి పేర్లు తెరపైకి వచ్చి అందరూ తెరమరుగైపోయి రెండవ విడతలో ఈనెల 29వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా చిలమకూరు గోపాల్, గవ్వల రమాదేవి తలపడుతున్నారు ఇప్పటికే పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి విజయం పై ఇరువురు అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతూ నార్పల ప్రజల మద్దతు తమకే ఉందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతర్గతంగా ప్రజల మనసులో ఏముందో మొత్తానికి విజయం ఎవరిని వరిస్తుందో నవంబర్ 29 ఆదివారంరాత్రి వరకు వేచి చూడాల్సిందే. దేశానికి స్వతంత్రం రాక పూర్వం ఏప్రిల్ ఒకటి 1935 లో నార్పల పంచాయతీ ఏర్పడింది. పురాతన పంచాయతీలలో నార్పల పంచాయితీ ఒకటి అప్పటినుంచి నార్పల సర్పంచులుగా గ్రామ పెద్దల నుండి సేకరించిన సమాచారం మేరకు స్వతంత్రానికి పూర్వం గ్రామ పెద్ద (సర్పంచ్)గా ఎర్రపరెడ్డి, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి సర్పంచ్ గా గాండ్ల తిరుపాలు, నార్పల ఆదినారాయణ రెడ్డి, ఆకుల రామప్ప, నార్పల సంజీవ రెడ్డి, నార్పల సత్యనారాయణ రెడ్డి, గవ్వల కమలమ్మ, నార్పల స్వాతిలత, ఆకుల నాగలలిత, మన్నిల సుప్రియ,ఇప్పటి వరకు సర్పంచులుగా చేశారు ఇందులో నార్పల ఆదినారాయణ రెడ్డి, నార్పల సంజీవరెడ్డి రెండు పర్యాయాలు సర్పంచులుగా చేసినట్లు తెలుస్తోంది. 100 సంవత్సరాలకి చేరువవుతున్న పురాతన అతిపెద్ద పంచాయతీగా జిల్లాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ, ప్రశాంతతకు నిలయమైన నార్పల పంచాయితీ సర్పంచ్ పీఠం ఈసారి ఎవరికి వరిస్తుందో అన్న ఆసక్తితో అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరు గెలిచిన గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రశాంతతకు పాటుపడాలని స్థానికులు కోరుతున్నారు. మండలంతలో ఇప్పటికే బీ.పప్పురు, బొందలవాడ పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. పప్పూరు సర్పంచ్ గా త్రివేణి, బొందలవాడ సర్పంచిగా అలివేలమ్మ ఏకగ్రీవ అయ్యారని మంగళవారం ఉప సర్పంచులను కూడా ఎన్నుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
01 02


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్